కరోనా వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నవారికి ఇది నిజంగా షాకింగ్ న్యూసే. మిగతా దేశాల సంగతి పక్కనపెడితే భారత్ లో మాత్రం కరోనా వ్యాక్సిన్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రావడానికి కనీసం 2022 ఏడాది చివరి వరకూ పట్టొచ్చని ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పష్టం చేయడం ఇప్పుడు కలవర పెట్టే అంశం. గులేరియా వివరణ ప్రకారం భారత్ లాంటి ఎక్కువ జనాభా ఉన్న దేశాల్లో ప్రజలందరికీ వ్యాక్సిన్ పంపిణీ చేయడమే విషయం చాలా క్లిష్టమైనదని, అందుకే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా.. కనీసం రెండేళ్లయినా సమయం పట్టొచ్చని తెలుస్తోంది.