తెలుగు రాష్ట్రాలతోపాటు.. దేశవ్యాప్తంగా ఐటీ సేవలందించే సాఫ్ట్వేర్ కంపెనీలు ఈసారి క్యాంపస్ ఇంటర్వ్యూలను భారీగా తగ్గించేస్తున్నాయి. కనీసం 40నుంచి 50శాతం వరకు క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో కోత పడుతుందని అంచనా. వివిధ కాలేజీల్లో క్యాంపస్ రిక్రూట్ మెంట్లు చేసే సిబ్బంది ఈమేరకు యాజమాన్యాలకు స్పష్టం చేశారు. క్యాంపస్ ప్లేస్ మెంట్స్ కోసం వచ్చే సంస్థలు వెనకాడటమే దీనికి కారణం.