ఏపీ ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. గతంలోనే దీనిపై స్పష్టత ఇచ్చినా.. మరోసారి ప్రతిపక్షాల రాద్ధాంతాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తరపున మంత్రి అవంతి శ్రీనివాస్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే విద్యార్థులకు ఈ ఏడాది హాజరు తప్పనిసరి కాదని తేల్చి చెప్పారు. కరోనా భయాల నేపథ్యంలో పిల్లల్ని స్కూళ్లకు పంపించాలా వద్దా అనే విషయంపై పూర్తిగా తల్లిదండ్రులదే నిర్ణయం అని అన్నారాయన. విద్యార్థులు తరగతులకు హాజరు కాకపోయినా వారిని పరీక్షలకు అనుమతిస్తామని, పై తరగతులకు ప్రమోట్ చేస్తామని చెప్పారు మంత్రి అవంతి.