సీఎం జగన్ చాలా కాన్ఫిడెంట్ గా పోలవరం ప్రాజెక్ట్ పై రైతులకు మాటిచ్చారు. పోలవరం ప్రాజెక్ట్ ని 2022నాటికి పూర్తి చేస్తామని, జాతికి అంకితం చేస్తామని, 2022 ఖరీఫ్ నాటికి రైతులకు నీరు అందిస్తామన్నారు. ప్రస్తుతం పనులు జరుగుతున్న స్పీడ్ చూస్తే జగన్ చెప్పినట్టు 2022 ఖరీఫ్ నాటికి పోలవరం పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు నిపుణులు. అదే జరిగితే.. జగన్ తండ్రిని మించిన తనయుడు అనిపించుకుంటారు.