మనం ఏం కోరుకుంటామో.. మన పిల్లలను హాస్టళ్లలో ఉంచితే ఎలాంటి సౌకర్యాలు కోరుకుంటామో అవన్నీ కూడా అన్ని హాస్టళ్లలో ఉండాలని అధికారులకు తెలిపారు సీఎం జగన్. ముఖ్యంగా బాత్రూమ్ లు చక్కగా ఉండాలని, వాటిని బాగా నిర్వహించాలని సూచించారు. మరమ్మతులు రాకుండా ఉండే విధంగా మంచి మెటీరియల్ వాడాలని చెప్పారు. గిరిజన ప్రాంతాల హాస్టళ్లలో బాత్రూమ్ లలో నీళ్లు లేక, విద్యార్థులు బయటకు వెళ్లడం తాను స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు జగన్. అందువల్ల హాస్టళ్లలో బాత్రూమ్ ల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.