పవన్ కల్యాణ్ తొలిసారిగా తెలంగాణలోని జనసేన కార్యకర్తలు, నాయకులపై ఒకింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. హైదరాబాద్ పరిధిలో రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే దీనికి కారణం అని తెలుస్తోంది. బీజేపీతో పొత్తు ఉందని తెలిసినా.. పొత్తులో భాగంగా కొన్నిసీట్లు మాత్రమే జనసేనకు వస్తాయని తెలిసినా కూడా నాయకులు వినడంలేదట. ఇప్పటినుంచే రికమండేషన్లతో విసుగు తెప్పిస్తున్నారట.