ఆప్ఘనిస్థాన్ దేశానికి చెందిన ఖతేరాకు చిన్ననాటి నుంచి పోలిసు ఆఫీసర్ కావాలనేది కల. కానీ ఆమె తండ్రికి ఆమె అంటే చిన్నచూపు. ముఖ్యంగా ఆడవారు బయటకు వెళ్లి పని చేయడం అంటే అతనికి అస్సలు నచ్చదు. ఖతేరా బలవంతం మీద అతడు ఆమె చదువుకి అతి కష్టం మీద అంగీకరించాడు. ఇక ఉద్యోగం విషయంలో మాత్రం అతడు రాజీ పడలేదు. ఈ క్రమంలో డ్యూటీలో జాయిన్ అయిన ఖతేరా తన విధులను ముగించుకుని ఇంటికి వస్తుండగా.. ముగ్గురు ముసుగు దొంగలు ఆమె మీద దాడి చేసి, అతి కర్కశంగా ఆమె కళ్లును పొడిచేసారు.