సాధారణంగా అధికార పార్టీలో ఆధిపత్య పోరు ఉంటుంది. ఒకే నియోజకవర్గంలో బలమైన నేతలు ఉన్నప్పుడు వారి మధ్య సయోధ్య లేకపోతే పార్టీలో ఇబ్బందులు తప్పవు. పైగా ఇతర పార్టీల నుంచి నేతలతో ఇంకా తలనొప్పులు పెరుగుతాయి. ఇక ఇలాగే ప్రస్తుతం అధికార వైసీపీలో పలుచోట్ల ఆధిపత్య పోరు గట్టిగానే నడుస్తోంది. ముఖ్యంగా ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో ఆది నుంచి వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ల మధ్య అసలు పొసగడం లేదు.