ఏపీలో ఎన్నికలై ఏడాదిన్నర దాటేసింది. అధికార వైసీపీ దూకుడు మరింత పెరిగింది. సీఎం జగన్ పాలనకు జనాల్లో ఇంకా వ్యతిరేకిత రాలేదు. కొందరి ఎమ్మెల్యేల పనితీరు సరిగ్గా లేకపోయినా సరే జనం జగన్ని చూసి, వైసీపీకి పూర్తి మద్ధతు ఇస్తున్నారు. అదే సమయంలో ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ, ఇప్పటికీ పెద్దగా పుంజుకున్నట్లు కనిపించడం లేదు. చంద్రబాబు నాయకత్వంలో జగన్ ప్రభుత్వంపై చేస్తున్న పోరాటాలు పెద్దగా ఫలితం ఇచ్చినట్లు కనిపించడం లేదు.