చంద్రబాబు టీడీపీని గాడిలో పెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎన్నికల్లో ఘోర ఓటమి వచ్చాక టీడీపీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైన విషయం తెలిసిందే. అధికార వైసీపీ దెబ్బకు టీడీపీ నాయకులు నియోజకవర్గాల్లో తిరగలేని పరిస్తితి నడిచింది. చంద్రబాబు, ప్రభుత్వం మీద పోరాటాలకు పిలుపునిచ్చినా సరే కొందరు నేతలు పెద్దగా పట్టించుకోలేదు. దానికి తోడు పలువురు నేతలు టీడీపీలో ఉండలేక వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఈ క్రమంలోనే చంద్రబాబు పార్టీని లైన్లో పెట్టడానికి పదవుల పంపకాలు చేపట్టారు. రాష్ట్ర అధ్యక్షుడుతో పాటు, కీలకమైన పదవులు భర్తీ చేశారు. పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు.