ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి వలసలు సహజంగానే జరుగుతాయి. ప్రతిపక్షంలో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఉండటం...అధికారంలో ఉంటే దేనికైనా తిరుగుండదని చెప్పి జంప్ అయిపోతారు. గతంలో అధికారంలో ఉన్న టీడీపీలోకి వైసీపీ నేతలు అలాగే జంప్ చేశారు. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉండటంతో టీడీపీ నేతలు వరుస పెట్టి గోడ దూకేస్తున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీని వీడారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా పదవులు పోకుండా, టీడీపీని వీడి వైసీపీలో చేరకుండా, జగన్కు మద్ధతు ఇస్తున్నారు.