2019 ఎన్నికల తర్వాత ప్రతి జిల్లా వైసీపీకి అనుకూలంగా మారిపోయిన విషయం తెలిసిందే. 13 జిల్లాలోనూ టీడీపీకి చుక్కలు చూపించి వైసీపీ సత్తా చాటింది. ఇక అందులో నాలుగు జిల్లాల్లో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసింది. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో టీడీపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు. అయితే ఇక్కడ కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలు ముందు నుంచి వైసీపీకి కంచుకోటలుగానే ఉన్నాయి.