కరోనా ఆస్పత్రుల సంఖ్య ఏపీలో గణనీయంగా తగ్గింది. నిన్న మొన్నటి దాకా ప్రభుత్వ, ప్రయివేటులో కలిపి మొత్తం 248 ఆస్పత్రులను కోవిడ్ సేవల కోసమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఆస్పత్రుల సంఖ్యను 169కి తగ్గించారు. మృతుల సంఖ్య కూడా గణనీయంగా తగ్గడం శుభపరిణామం. కరోనా విలయతాండవం చేసిన రోజుల్లో ఒక దశలో రోజుకు 90 మంది కూడా ఏపీలో మరణించిన ఉదాహరణలున్నాయి. ప్రస్తుతం మరణాల సంఖ్య 10కంటే తగ్గింది. సగటున రోజుకి ఏపీలో కరోనాతో మరణించే వారి సంఖ్య 10కంటే తక్కువే.