ఓటీటీ వేదికలు, డిజిటల్ న్యూస్ వెబ్ సైట్లు, కరెంట్ అఫైర్స్ కంటెంట్ ను.. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోకి తెస్తూ కేంద్రం ఉత్తర్వులు ఇచ్చింది. ఇకపై యూట్యూబ్ ఛానెళ్లు మొదలు పెట్టాలనుకునేవారికి మరిన్ని నిబంధనలు ఉంటాయనమాట. ఇప్పటి వరకూ కేవలం జి-మెయిల్ అకౌంట్ ఉంటే చాలు, వారు ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టేయొచ్చు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలు పాటిస్తేనే యూట్యూబ్ లో న్యూస్ ఛానెల్ రన్ చేసే అవకాశం ఉంటుంది.