పోర్న్ సైట్స్ వ్యవహారం ఓ భక్తుడి ఫిర్యాదు ద్వారా వెలుగులోకి రావడంతో.. వెంటనే నష్టనివారణ చర్యలు చేపట్టిన ఎస్వీబీసీ ఆ పని చేసిన అటెండర్ పై వేటు వేసింది. అదే సమయంలో ఛానెల్ లో మిగతా ఉద్యోగులపై కూడా దృష్టిపెట్టింది. రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ టీమ్ అలిపిరిలోని ఎస్వీబీసీ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. 82 కంప్యూటర్లను, సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. మిగతా కంప్యూటర్లలో కూడా పోర్న్ సైట్స్ చూసినట్టు ఆధారాలున్నాయని, బ్రౌజర్ హిస్టరీలో అన్ని విషయాలు బైటపడ్డాయని తెలిసింది. అయితే ఆ సమయంలో కంప్యూటర్లను ఎవరు వినియోగించారు, ఎవరు పోర్న్ సైట్స్ చూశారనే విషయాన్ని నిర్థారించుకునేందుకు సీసీ టీవీ ఫుటేజ్, అటెండెటన్స్ ను పరిశీలిస్తున్నారు.