జగన్ పై టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్ర విమర్శలు చేశారు..వీర జవాన్ల మరణాల్లో కూడా కుల వివక్షను ప్రజలు గమనించటం లేదా , లేక గమనించి కూడా అడిగే ధైర్యం చేయటం లేదా అనేది అర్థం కావటం లేదని అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో మొదటిసారి మరణాన్ని కూడా ప్రభుత్వం కులాలతో చూస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయని చెప్పారు.. ఇలా ప్రజల దగ్గర కుల వివక్షత ఉండటం వల్ల రాష్ట్రం పతనమై పోతుంది అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.