ప్రాణాలు తీసిన అక్రమ సంబంధం..యాదాద్రి జిల్లాలో ఓ మహిళ హత్య కలకలం రేపుతోంది. జిల్లాలోని భువనగిరి బై పాస్ రోడ్డు పక్కన గుట్టల్లో లక్ష్మి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసినట్లు తెలుస్తోంది. మహిళను హత్య చేసిన అనంతరం ప్రియుడు కుమార్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు.