దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం టీ ఆర్ ఎస్ పార్టీ చెంప పెట్టు లాంటిదే అని చెప్పొచ్చు. కారణాలు ఏవైనా దుబ్బాక టీ ఆర్ ఎస్ చేతి నుంచి చేజారిపోయింది.. ఇక్కడ అధికార పార్టీ వైఫల్యం కంటే బీజేపీ పై ఉన్న సానుభూతి కారణంగానే బీజేపీ గెలిచింది అని సర్వేలు ఇప్పటికే తేల్చాయి. మూడో సారి పోటీ చేసిన రఘునందన్ రెడ్డి కి అవకాశం ఇవ్వాలని ప్రజలు ఈవిధంగా తీర్పు నిచ్చారు.. అయితే ఇందులో టీ ఆర్ ఎస్ వైఫల్యం లేదన్నది రాజకీయ విశ్లేషకుల అంచనా.. మరో వైపు బీజేపీ కూడా రాష్ట్రం లోబలపడుతుండడం దీనికి దోహదపడింది. అయితే బీజేపీ గెలవడం ఏమో కానీ బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతున్నాయి అని వారి విమర్శలను చూస్తే తెలుస్తుంది.