ఏపీలో బలంగా ఉన్న అధికార వైసీపీకి ధీటుగా టీడీపీని నిలబెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు, ఇటీవల పార్టీలో పదవుల పంపకాలు చేపట్టిన విషయం తెలిసిందే. పార్టీలో కీలక పదవులు అన్నీ భర్తీ చేశారు. ఈ క్రమంలోనే ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కూడా మార్చారు. కిమిడి కళావెంకట్రావుని తప్పించి అచ్చెన్నాయుడుకు బాధ్యతలు అప్పగించారు. వాస్తవానికి కళా అధ్యక్షుడుగా ఉన్న సమయంలో పెద్దగా టీడీపీకి ఉపయోగం ఏమి రాలేదు. అసలు చెప్పాలంటే కళా అధ్యక్షుడు అనే సంగతి సొంత పార్టీలో చాలామందికి తెలియదు.