అధికార వైసీపీలో యువనేతలకు ఏ మాత్రం కొదవ లేదు. జగన్ అంటే అభిమానంతో ఉంటూ, పార్టీ కోసం నిరంతరం కష్టపడే నాయకులు ఎక్కువగానే ఉన్నారు. అలాగే అతి తక్కువ కాలంలోనే పార్టీలో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న యువనేతలు ఎక్కువే. అలా చాలా తక్కువ సమయంలో విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి.