ఏపీలో కమ్మ సామాజికవర్గానికి బాగా పట్టున్న జిల్లాలు కృష్ణా, గుంటూరులు ముందు వరుసలో ఉంటాయి. ఈ రెండు జిల్లాల్లో కమ్మ సామాజికవర్గానికి మంచి పట్టు ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే టీడీపీలో కమ్మ నేతల హవా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇందులో గుంటూరు జిల్లాలో కమ్మ నేతల డామినేషన్ కాస్త ఎక్కువ. ఇక టీడీపీలో ఉన్న కమ్మ నేతలకు చెక్ పెట్టడానికి వైసీపీలో కూడా కమ్మ వారికి సీట్లు ఇచ్చి జగన్ 2019 ఎన్నికల్లో ముందుకెళ్లారు.