ఇన్నాళ్లూ ఇసుక రేట్లు భారీగా పెరిగిపోవడంతో పేదలు ఇళ్లు కట్టుకోడానికి, ఇతర గృహ అవసరాలకు తెగ ఇబ్బంది పడేవారు. ఇకపై పేదలకు, బడుగు బలహీన వర్గాల వారికి పూర్తిగా ఉచితంగా ఇసుక ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో కూడా ఇదే నిబంధన ఉన్నా కూడా.. అధికారులు దాడులు చేస్తే పర్మిషన్ లెటర్లు చూపించలేక ఇబ్బంది పడేవారు. ఇకపై ఆ అవకాశం లేకుండా ఏపీ ప్రభుత్వం కొత్త జీవో తీసుకొచ్చింది. దీని ప్రకారం ప్రజలు సొంత అవసరాలకు ఇసుకను ఎడ్లబండ్లపై ఉచితంగా తీసుకెళ్లొచ్చు. దీనికోసం కూపన్లు జారీ చేస్తారు.