ఏపీలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను లోక్ సభ నియోజకవర్గాల వారీగా 25 జిల్లాలుగా మార్చాలనే ప్రతిపాదన చేసిన వైసీపీ ప్రభుత్వం దీనికి సంబంధించిన కసరత్తులు మొదలు పెట్టింది. కొత్తగా గిరిజన జిల్లా ఏర్పాటు చేస్తే వాటి సంఖ్య 26కి పెరిగే అవకాశం ఉంది. అయితే ఇటీవల వాట్సప్ గ్రూపుల్లో కొత్త జిల్లాల సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అసలు ఎవరు ఇలాంటి పుకారు సృష్టించారో తెలియదు కానీ.. విపరీతంగా ఈ మెసేజ్ ఫార్వార్డ్ అవుతోంది. దీంతో కొత్త జిల్లాలపై ప్రజల్లో కూడా అనుమానాలు నెలకొని ఉన్నాయి.