భక్తుల మనసును టీటీడీ కల్తీ చేస్తుంది..బాబు సంచలన వ్యాఖ్యలు..ఒక ఆటవిక రాజ్యంతో టీటీడీ అధికారులు ముందుకుపోతున్నారని దుయ్యబట్టారు. పుంగనూరు ఓం ప్రకాష్ ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ దగ్గర సమాధానం ఏమైనా ఉందా? అని ప్రశ్నించారు. ఒక ప్రతిపక్ష నేతగా తాను తప్పులను ప్రశ్నించకూడదా అని నిలదీశారు. ప్రజలకు సమాధానం చెప్పకుండా,తమను సాక్ష్యాలడిగే పరిస్థితిలో పోలీసులున్నారని చంద్రబాబు దుయ్యబడ్డారు. ఇదే తీరు కొనసాగితే రేపు పోలీసులు కూడా బలికాక తప్పదని హెచ్చరించారు.