గంటా శ్రీనివాసరావు...ఏపీ రాజకీయాల్లో జంపింగ్‌కు పెట్టింది పేరు. ఎన్నిసార్లు పార్టీ మారినా...విజయం మాత్రం ఈయన సొంతం. టీడీపీలో రాజకీయ జీవితం మొదలుపెట్టి, ఆ తర్వాత ప్రజారాజ్యం, కాంగ్రెస్, మళ్ళీ టీడీపీలోకి వచ్చి మొన్న టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. ఇక ఇప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాక, మళ్ళీ మారడానికి ప్రయత్నిస్తున్నారు. 2019 ఎన్నికల్లో విశాఖ నార్త్ నుంచి గెలిచిన గంటా...ఎప్పటి నుంచో టీడీపీకి దూరంగా ఉంటున్నారు. మొదటలో ఈయన బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.