టీడీపీ నుంచి గెలిచిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, వైసీపీ వైపు వెళ్ళాక నియోజకవర్గంలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. మొదట వంశీ రాకని ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన యార్లగడ్డ వెంకట్రావు వ్యతిరేకించారు. అయితే జగన్...యార్లగడ్డకు కృష్ణా కోపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ ఇవ్వడంతో సమస్య సద్దుమనిగిందని అంతా అనుకున్నారు.