విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి జన్మదిన వేడుకల్ని జరపాలంటూ పలు దేవాలయాలకు ఏపీ దేవాదాయశాఖ మెమో జారీ చేయడం సంచలనంగా మారింది. ఈనెల 18న స్వరూపానందేంద్ర జన్మదినం. ఈ సందర్భంగా ఆయా ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించాలని దేవాదాయ శాఖ అదనపు కమిషనర్ కె.రామ చంద్రమోహన్ ఆదేశాలు జారీ చేశారు.