ఏపీలో వైఎస్సార్ బీమా పథకం అమలుకి సంబంధించి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది విధివిధానాలతో కూడిన ఉత్తర్వులు జారీ చేశారు. అర్హత ఉన్న వారు ఈ పథకంలో ఎప్పుడైనా తమ పేర్లను సచివాలయాల్లో నమోదు చేసుకోవచ్చని ఉత్తర్వులో పేర్కొన్నారు. లబ్ధిదారుని పరిధికి సంబంధించిన వాలంటీర్ ఆ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లి మొబైల్ యాప్లో వివరాలు నమోదు చేసుకుంటారు. ఈ ప్రాథమిక పరిశీలన పూర్తికాగానే సచివాలయాల్లో పనిచేసే డిజిటల్ అసిస్టెంట్, వాలంటీర్.. ఇద్దరు కలిసి వెళ్లి ఆ కుటుంబానికి తక్షణ ఖర్చుల నిమిత్తం నామినీకి రూ.10 వేలు చెల్లిస్తారు.