2019 ఎన్నికల్లో జగన్ సృష్టించిన ప్రభంజనం ఎవరు మర్చిపోరు. ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 175 సీట్లకు గాను 151 సీట్లు గెలిచి సంచలనం సృష్టించారు. అదే సమయంలో టీడీపీ కూడా చరిత్రలో లేని విధంగా ఓటమి పాలైంది. ఆ పార్టీ కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. అంటే కొద్ది సీట్లు తేడాతో చంద్రబాబు ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు. సాధారణంగా మొత్తం సీట్లలో 10వ వంతు సీట్లు గెలిస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది. అంటే 175 సీట్లకు 17-18 సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుంది.