రాజకీయాల్లో త్వరగా ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నేతలు చాలా తక్కువగా ఉంటారు. అతి తక్కువ సమయంలోనే ప్రజాధరణ త్వరగా రాదు. పైగా వారసత్వ రాజకీయాల నుంచి కాకుండా సొంతంగా రాజకీయ రంగంలోకిన వచ్చినవారు క్లిక్ అవ్వడం చాలా అరుదు. అలా అరుదుగా రాజకీయాల్లో బాగా క్లిక్ అయిన నాయకురాలు విడదల రజిని...ఎన్ఆర్ఐగా వచ్చిన రజిని గతంలో అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. ఇక అప్పుడు చిలకలూరిపేటలో సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ద్వారా టీడీపీలో కీలకంగా ఎదుగుతూ వచ్చారు.