టీకా అవసరం లేకుండానే కరోనా తగ్గిపోతుందన్న ఆశ భారత ప్రజల్లో మెల్లిమెల్లిగా పెరుగుతోంది. ఈ అభిప్రాయాన్ని బలపరుస్తూ.. కరోనాకి టీకా అవసరం లేని దశకు చేరుకుంటున్నామని, టీకా వచ్చేలోపు భారత్ లో హెర్డ్ ఇమ్యూనిటీ వచ్చేస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా చెప్పారు. కొవిడ్-19 టీకా అందుబాటులోకి రావడానికి కంటే ముందే భారత దేశ ప్రజలు హెర్డ్ ఇమ్యూనిటీ పొందే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు. అంటే టీకా అందుబాటులోకి రావడానికంటే ముందుగానే టీకా తీసుకోవడం వల్ల వచ్చే ఫలితాలు మనలో కలుగుతాయన్నమాట. కొవిడ్ ని నిరోధించే యాంటీబాడీస్ మన శరీరంలో ఉత్పత్తి అవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది.