జీహెచ్ఎంసీ ఎన్నికలని టీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దుబ్బాకలో ఎదురైన పరాభవాన్ని ఎంత త్వరగా మర్చిపోతే అంత మేలు అనుకుంటూ.. బల్దియా ఎన్నికలకు సిద్ధపడుతోంది. అదే సమయంలో బీజేపీ కూడా భాగ్య నగరంపై పట్టు పెంచుకోడానికి శాయశక్తులు ఒడ్డుతోంది. ఈ పోటీ ఫలితంగా హైదరాబాద్ వాసులు పండగ చేసుకుంటున్నారు. ఎన్నికల వేళ టీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ వాసులపై వరాల జల్లు కురిపించింది. వరదసాయం, ఆస్తిపన్నులో రాయితీ, ఉద్యోగుల జీతాల పెంపు ఇలా రకరకాల వరాలతో నగర వాసుల్ని ఆకట్టుకోవాలని చూస్తోంది.