ఏపీలో స్థానిక ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై రాజకీయ నాయకుల్లో ఎవరి లెక్కలు వారికున్నాయి. ఎన్నికలు జరపాలనే డిమాండ్ తో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంటే.. అధికార వైసీపీ మాత్రం ఇప్పుడు ఎన్నికలు ఎందుకంటూ నింపాదిగా ఉంది. కరోనా కేసులు పూర్తి స్థాయిలో తగ్గిపోయిన తర్వాతే ఎన్నికలకు వెళ్దామంటూ చెబుతున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. వైసీపీ లెక్కలు నిజమైతే.. 2021 జూన్, జులై నెలల్లో స్థానిక ఎన్నికలు జరుగుతాయి.