విశాఖలో విషాదం..ఒక నిండు ప్రాణాన్ని బలికొన్న పేకాట..ఆన్లైన్ రమ్మీలో భారీగా డబ్బులు పోగొట్టుకుని అప్పులపాలైన ఉద్యోగి రైల్వే ట్రాక్‌పై ఆత్మహత్య చేసుకున్నాడు. భార్యాబిడ్డలను నట్టేట ముంచాడు. నగరంలోని గోపాలపట్నం శివారు కొత్తపాలేనికి చెందిన మద్దాల సతీష్ నావెల్ డాక్ యార్డులో ఉద్యోగం చేస్తున్నాడు. కొద్దికాలంగా ఆన్లైన్ రమ్మీకి బానిసగా మారిన సతీష్ పేకాటలో సంపాదించిన వాటితో పాటుగా ఉన్నది మొత్తం పోగొట్టుకున్నాడు..దాంతో మరణమే శరణం అని ఆత్మహత్య చేసుకొని మరణించాడు.