పోలవరం ఎత్తు తగ్గించడంలేదంటూ అవసరమైతే టీడీపీ నేతలు వచ్చి కొలుచుకోవాలంటూ వైసీపీ నేతలు సవాల్ విసిరారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఈ విషయంపై తీవ్రంగా స్పందించారు. పోలవరం ప్రాజెక్ట్ ను వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేసి తీరతామని స్పష్టం చేసిన ఆయన.. అవసరమైతే చంద్రబాబు టేప్ తీసుకొచ్చి పోలవరం ప్రాజెక్ట్ ఎత్తు కొలుచుకోవాలని సూచించారు. అంగుళం కూడా తేడా రాదని అన్నారు. ఇక ఫైనల్ గా చంద్రబాబుని పోలవరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి కూడా పిలుస్తామని చెప్పారు అనిల్. ఆయనకు కొత్త బట్టలు పెట్టి స్వాగతం పలుకుతామని, ఆలోగా చంద్రబాబు ఎక్కడికీ పోరు కదా, ఇక్కడే ఉంటారు కదా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు అనిల్.