విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద జన్మదినం సందర్భంగా దేవాదాయ శాఖ ఉన్నతాధికారి పేరుతో వివిధ ఆలయాలకు వెళ్లిన సర్క్యులర్ వివాదంగా మారింది. దీనిపై టీడీపీ రాద్ధాంతం చేయాలని చూడగా.. అదే స్థాయిలో వైసీపీ నేతలు వారిపైనే తిరిగి విమర్శలు సంధించారు. పోటాపోటీగా ఇరు పార్టీల నేతలు విమర్శలు చేసుకుంటూ.. స్వరూపానంద జన్మదినాన్ని వార్తల్లో నిలిపారు. దీనిపై స్వరూపానంద కానీ, ఆయన తరపున శారదా పీఠం నుంచి కానీ ఎలాంటి వివరణ కూడా బయటకు రాలేదు.