సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల నుంచి 117కోట్ల రూపాయలు కొట్టేసేందుకు ప్లాన్ చేసిన ముఠాని పోలీసులు అరెస్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే ఇద్దరు కీలక నిందితుల్ని పట్టుకుని వారి వద్ద సమాచారం సేకరించారు. ఈ వ్యవహారం మొత్తం ఇతర రాష్ట్రాల్లో జరుగుతున్నందున.. అక్కడికే మన సీఐడీ పోలీసులు వెళ్లి విచారణ చేపట్టారు. అయితే ఇందులో ఇంటిదొంగల పాత్ర కూడా ఉన్నట్టు తేలింది. అధికారుల స్థాయిలో ఎవరైనా వారికి సహకరిస్తున్నారా, లేక కింది స్థాయి సిబ్బంది, ప్రైవేట్ వ్యక్తులు ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.