ఎన్నికల వ్యూహాల్లో చంద్రబాబు ఎవరూ ఊహించని నిర్ణయాలు తీసుకుంటారు. బీజేపీతో జతకట్టిన ఐదేళ్లలోనే వారిని కాదని, కాంగ్రెస్ తో కలసిపోయిన చరిత్ర బాబుకి ఉంది. గెలుపుకోసం ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుండే చంద్రబాబుకి ఆ వ్యూహాలు ఎంతవరకు కలిసొచ్చాయనే విషయం పక్కనపెడితే.. ప్రత్యర్థులను మాత్రం ఆలోచనలోకి నెట్టడం ఖాయం. తాజాగా చంద్రబాబు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలకు అందరికంటే ముందే అభ్యర్థిని ఖరారు చేసి ప్రత్యర్థి పార్టీలకు షాకిచ్చారు. ఒకరకంగా వైసీపీని ఆలోచనలో పడేశారు.