నవంబర్ 2న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు తెరిచింది ఏపీ సర్కారు. స్కూళ్లు ప్రారంభించి 14 రోజులు గడిచిన నేపథ్యంలో కోవిడ్ వ్యాప్తి భయపడినంతగా లేకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన క్రమంగా తగ్గింది. ఈ నెల 15వ తేదీ వరకు నమోదైన పాజిటివ్ కేసులను బట్టి చూస్తే ఆందోళన పడాల్సిన అవసరం లేదని అంటున్నారు అధికారులు. విశాఖపట్నం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని స్కూళ్లలో జీరో శాతం కరోనా పాజిటివిటీ ఉన్నట్లు తేలింది. సగానికి పైగా జిల్లాల్లో 0.1 శాతం మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయి.