టీడీపీ ప్రభుత్వం చదరపు అడుగుకి రూ.500 అదనంగా చెల్లించేందుకు ఒప్పందం కుదుర్చుకుందని, తద్వారా వేలా కోట్ల ప్రజాధనం దోపిడీకి పథక రచన చేసిందని ఆరోపించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఆ భారం లబ్ధిదారులపై పడకూడదన్న ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ విధానాన్ని అవలంబించి, ప్రజాధనాన్ని కాపాడినట్టు ఆయన తెలిపారు. ఈ రివర్స్ టెండరింగ్ కారణంగానే లబ్ధిదారులకు ఇళ్ల అప్పగింత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు.