గన్నవరం నియోజకవర్గంలో అధికార వైసీపీలో ఆధిపత్య పోరు తగ్గేలా కనిపించడం లేదు. టీడీపీ నుంచి వచ్చిన వల్లభనేని వంశీని, ఇతర వైసీపీ నేతలు టార్గెట్ చేస్తూనే ఉన్నారు. వరుసపెట్టి వంశీ రాకని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ...కొన్నిరోజుల తర్వాత జగన్కు జై కొట్టిన విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలో ఉండటంతో వంశీ చంద్రబాబుకు షాక్ ఇచ్చేశారు.