ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పలు సంచలన నిర్ణయాలతో పాలనలో దూకుడు ప్రదర్శిస్తున్న విషయం తెలిసిందే. జగన్ అనేక సంచలన నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్షానికి ఊహించని షాకులు ఇస్తూ వెళుతున్నారు. మూడు రాజధానుల ఏర్పాటు, రివర్స్ టెండరింగ్, పిపిఏలు పునఃసమీక్ష...అమరావతి భూముల అక్రమాలపై విచారణ...అబ్బో ఒకటి ఏంటి అనేక రకాలుగా జగన్ ప్రభుత్వం, టీడీపీకి షాక్ ఇచ్చేలా నిర్ణయాలు తీసుకుంది.