అవసరాన్ని బట్టి రాజకీయం చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుని మించిన వారు లేరనే చెప్పొచ్చు. ఎవరిని ఎక్కడ ఉపయోగించుకోవాలి, ఎక్కడ వరకు ఉపయోగించుకోవాలనే విషయం బాబుకు తప్పా మరొకరి తెలియదు. అందుకే ఆయనని నమ్ముకున్న నేతలకు పెద్దగా న్యాయం జరగదనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. అయితే తాజాగా కూడా అలాంటి చర్చే బాబు విషయం జరుగుతుంది. ఇటీవల బాబు, పార్టీలో కీలక పదవులు భర్తీ చేసిన విషయం తెలిసిందే.