2019 ఎన్నికల్లో జగన్ దెబ్బకు టీడీపీ, జనసేనలు చిత్తు చిత్తుగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అలాగే జనసేన వల్ల టీడీపీకి ఏ రేంజ్లో దెబ్బ పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా చోట్ల జనసేన భారీగా ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీ గెలవాల్సిన సీట్లలో కూడా ఓటమి పాలైంది. దాని వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ అయింది. ఆ సీట్లు కూడా వైసీపీ ఖాతాలో పడ్డాయి.