కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో అంత సీన్ లేదనే విషయం తెలిసిందే. బీజేపీకి రెండు రాష్ట్రాల్లో పెద్ద స్కోప్ లేదు. కానీ 2019 పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ బలం కాస్త పెరిగింది. నాలుగు ఎంపీ సీట్లు గెలవడంతో తెలంగాణలో బీజేపీ నిలబడింది. ఇక నిదానంగా బీజేపీ, అక్కడి అధికార టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం ఎదుగుతూ వచ్చింది. తాజాగా జరిగిన దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ని ఓడించి సంచలనం సృష్టించింది.