ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాగా హాట్ టాపిక్‌గా ఉన్న విషయం తిరుపతి ఉపఎన్నిక. 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున భారీ మెజారిటీతో గెలిచిన బల్లి దుర్గాప్రసాద్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే పదవులో ఉండే వ్యక్తి మరణిస్తే, ఉపఎన్నికల్లో ఆ వ్యక్తి కుటుంబానికి సీటు ఇస్తారు. అలాగే ఇతర పార్టీలు కూడా తమ అభ్యర్ధులని పెట్టకుండా, ఆ స్థానాన్ని ఏకగ్రీవం అయ్యేలా చేస్తారు.