ఏపీలో ప్రతిపక్ష టీడీపీపై దూకుడుగా విమర్శలు చేసే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మంత్రి కొడాలి నానినే.. గుడివాడ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నాని, ప్రస్తుతం జగన్ ప్రభుత్వంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. పాలన పరంగా మంచి పట్టు తెచ్చుకుని దూసుకెళుతున్న నాని, ప్రతిపక్షానికి చెక్ పెట్టడంలో కూడా ముందున్నారు.