తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పలివెల గ్రామానికి చెందిన యర్రాప్రగడ కృష్ణకిషోర్ 10 ఏళ్ల కిందట అమెరికాలోని చికాగో వెళ్లి సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా పని చేస్తూ అక్కడే ఉండిపోయారు. ఆయనకు గ్రీన్ కార్డు ఇమ్మిగ్రేషన్ నిమిత్తం బర్త్ సర్టిఫికెట్ అవసరమైంది. కోవిడ్ కారణంగా ఇక్కడికి స్వయంగా రాలేని ఆన్ లైన్ లో కావాల్సిన ధృవపత్రాలు పంపుతానని, తనకి బర్త్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డిని ఆన్లైన్లో సంప్రదించారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయమై సిబ్బందికి సమాచారం పంపించారు. 15రోజుల్లోగా బర్త్ సర్టిఫికెట్ అతనికి ఆన్ లైన్ లో పంపించారు.