సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై డీజీపీ గౌతమ్ సవాంగ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇలాంటి ప్రచారాలు చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నెల్లూరు జిల్లాలో గ్యాంగ్‌వార్ పేరిట పలు టీవీ చానళ్లు, సోషల్ మీడియాలో ప్రసారమైన వీడియోల్లోని ఘటనలు గతేడాది నవంబర్, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగినవిగా పోలీసులు గుర్తించారు. ఈ విషయంపై డీజీపీ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ కథనాలపై స్పందించిన డీజీపీ గౌతమ్‌సవాంగ్ తక్షణ విచారణ జరపాలని గుంటూరు రేంజ్ డీఐజీ, నెల్లూరు జిల్లా ఎస్పీలకు ఆదేశాలు కూడా ఇచ్చారు.