రాష్ట్ర ప్రభుత్వమే వెనక్కి తగ్గిందో లేక.. శారదా పీఠం రాసిన లేఖను వెనక్కు తీసుకోవడం వల్ల తన నిర్ణయం మార్చుకుందో తెలియదు కానీ.. మొత్తమ్మీద శారదా పీఠం, స్వరూపానంద జన్మదినం వ్యవహారం సామరస్యంగా ముగిసింది. ఏకంగా కోర్టులోనే విచారణ జరిగిన తర్వాత శారదా పీఠం తమ లేఖను ఉపసంహరించుకుంటామని తెలిపింది. ఈ లేఖ ఉపసంహరణతో ప్రభుత్వం కూడా తమ మెమోను వెనక్కి తీసుకుంది.